PV NEWS/నక్కలోళ్ల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి

79

PV NEWS(SARVEPALLI);సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, చెముడుగుంట లోని నక్కల కాలనీలోని నక్కలోళ్ల కుటుంబాలకు నిత్యావసర సరుకులను వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో సంచారజాతులైన నక్కలోళ్ళ కుటుంబాలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి కరువై పేదరికంలో మగ్గిపోతున్న నక్కలోళ్లు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకమైన జీవన శైలి కలిగి ఉండే నక్కలోళ్ల కుటుంబాలు ఆకలితో అలమటించకుండా బియ్యం, వంటనూనెను పంపిణీ చేశామన్నారు.
అవసరమైన ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ, అన్ని వర్గాల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు.
కరోనా నేపథ్యంలో సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు.