PV NEWS/వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. పరారీలో నిర్వాహకులు.. మైనర్ బాలికకు విముక్తి..

350

PV NEWS (NELLORE) ;ఆర్థిక సమస్యలు ఆ బాలికను వ్యభిచార కూపంలోకి దించాయి. నిజామాబాద్ కు చెందిన మైనర్ బాలిక పరిస్థితులను అదునుగా తీసుకుని విజయవాడకు చెందిన కృష్ణ అతని భార్య సన నెల్లూరు హరనాథపురం లో నివాసం ఉంటున్న లావణ్యతో కలిసి మైనర్ బాలిక చేత వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందుకూరుపేట మండలం కొరుటూరు గ్రామానికి చెందిన విటులను మైనర్ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వ్యభిచార గృహ నిర్వాహకులు పరారీలో ఉన్నారని రూరల్ డిఎస్పి హరినాథ్ రెడ్డి తెలిపారు.