PV NEWS/ చిరంజీవి యువత సేవా కార్యక్రమాలు అభినందనీయం… రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి

117

PV NEWS/ NELLORE;-వాతావరణ అసమతుల్యత కారణంగా ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మద్రాసు బస్టాండ్ సమీపంలో ఉన్న రెడ్క్రాస్ కార్యాలయంలో చిరంజీవి యువత జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా మాస్కులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అజయ్ ను రెడ్ క్రాస్ కన్వీనర్ గా ఎన్నుకున్నందుకు చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.