PV NEWS/ క్వారంటైన్ సెంటర్ కు వచ్చిన రోజే కరోనా టెస్ట్ చేయాలి.. కలెక్టర్ శేషగిరిబాబు

119

PV NEWS/NELLORE;- క్వారంటైన్ సెంటర్లలో అన్ని వసతులు కల్పించాలని అధికారులకు కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కొవిడ్-19 క్వారంటైన్ సెంటర్ల నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వారంటైన్ సెంటర్లకు వచ్చిన రోజే covid 19 పరీక్షలు నిర్వహించాలని నెగటివ్ వచ్చినవారికి ఏడవ రోజున పరీక్షలు నిర్వహించి డిశ్చార్జ్ చేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన మార్గదర్శకాలను విధిగా పాటించాలన్నారు. మెనూ ప్రకారం ఆహారం అందజేయాలని, శానిటేషన్ చర్యలు పక్కాగా చేపట్టాలన్నారు. గర్భవతులకు, పిల్లలకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు. 24 గంటల్లో covid-19 పరీక్ష ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Covid 19 పరీక్షల నిర్వహణలో కూలింగ్ విధానాన్ని ప్రతిరోజు 50 వరకు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్ష లో జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, డి ఎం హెచ్ ఓ రాజ్యలక్ష్మి, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీహరి ఇతర నోడల్ అధికారులు పాల్గొన్నారు.