PV NEWS/ మార్కింగ్ ను ఫాలో అవ్వండి.. హ్యాపీగా షాపింగ్ చేసుకోండి.. ఎం జి బి మాల్ జిఎం రవి కిరణ్

159

PV NEWS/NELLORE;-సుదీర్ఘ లాక్ డౌన్ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెస్టారెంట్లు మాల్స్ ప్రారంభించడానికి అనుమతించాయి. నెల్లూరు నగరంలో ఉన్న ఏకైక మాల్ ఎం జి బి. ఈ మాల్ పునఃప్రారంభం రోజున ప్రాంగణమంతా పూర్తిస్థాయిలో శానిటైజింగ్ చేశామని ప్రభుత్వ నిబంధనల ప్రకారము విసిటర్లను అనుమతించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిఎం రవి కిరణ్ తెలిపారు. సిబ్బంది, సందర్శకులు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరడుగుల దూరాన్ని పాటించేలా మార్కింగ్ చేశామన్నారు. లిఫ్ట్ లో సైతం తగు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. గేమ్స్ కోర్ట్ , ఫుడ్ కోర్ట్ మినహా అన్ని షాపులు యధావిధిగా పని చేస్తాయన్నారు. సందర్శకులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ను ఎంట్రన్స్ లో నమోదు చేసుకోవాలని , తగు జాగ్రత్తలతో షాపింగ్ చేసుకోవాలని సూచించారు.