PV NEWS/ తన నియోజకవర్గ ప్రజల నీటి అవసరాల కోసం పోరాడి సాధించిన అధికారపార్టీ ఎమ్మెల్యే

106

ఓట్లు వేసి గెలిపించిన తన నియోజకవర్గ ప్రజల నీటి అవసరాలు తీర్చడం కోసం వెంకటగిరి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గత కొద్ది రోజులుగా ఇరిగేషన్ శాఖ పై తీవ్రవిమర్శలు చేసి విజయం సాధించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి తన నియోజకవర్గ అభివృద్ధి పట్ల ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేశారు వెంకటగిరి రైతాంగ ప్రయోజనాలకు, మెట్ట ప్రాంత ప్రయోజనాలకు తెలుగు గంగ నీటిని విడుదల చేయించారు.కండలేరు డ్యామ్ నుంచి కాలువల ద్వారా త్రాగునీరు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. డక్కిలి మండలం వెలికల్లు చెరువుకు తెలుగుగంగ కాలువ నుండి లిఫ్ట్ పెట్టేందుకు ఇంజనీరింగ్ అధికారులు సంబంధించిన ప్రపోజల్స్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి సమర్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. డక్కిలి మండలం మోపూరు వడ్డిపల్లి సమీపాన (39.4 కిలోమీటర్ల వద్ద) 4వ బ్రాంచ్ కాలువను పరిశీలించారు. ఎస్కేప్ పాయింట్ ఓపెన్ చేస్తే సైదాపురం మండలం లోని దాదాపు పది పదిహేను గ్రామాలకు వచ్చే నీటి ద్వారా అందరికీ త్రాగునీరు, సాగునీటికి అవకాశం ఉంటుందన్నారు.