PV NEWS/ 34 సంక్షేమ పథకాలను ప్రజలకు దూరం చేసిన ప్రభుత్వం మీది…

78

PV NEWS/ NELLORE;-తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ని చూపించి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని రాష్ట్ర ప్రజలను అడుక్కుంటే వచ్చిన పదవి తో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు. సీనియర్ టిడిపి నేతల అరెస్టు ను ఖండిస్తూ స్థానిక టిడిపి కార్యాలయంలో బీసీ సంఘ నాయకులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శక పాలన పేరుతో టిడిపి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు దూరం చేశారన్నారు. ఇసుకను సామాన్యులకు అందకుండా చేశారని అన్నా క్యాంటీన్ లను మూయించారన్నారు. పేదల కోసం ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా ను రద్దు చేశారన్నారు. వైసిపి ప్రభుత్వం దౌర్జన్యకాండను ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.