PV NEWS/ అచ్చెన్నాయుడిపై కేసు నమోదు చేయడానికి ఏడాది పట్టింది….

48

PV NEWS/ NELLORE;- టిడిపి పార్టీ ని భూస్థాపితం చేయాలనే కుట్రతో టిడిపి నేతలపై అక్రమ కేసులు పెట్టడానికి జగన్ మోహన్ రెడ్డికి ఏడాది కాలం పట్టిందని నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతంలోని ఆయన నివాసం వద్ద టిడిపి నేతల అరెస్టు లను నిరసిస్తూ కార్యకర్తలతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు ఎక్కడ చూడలేదు అన్నారు. టిడిపి లేకుండా చేయడం ఆయన తరం కాదని రెండింతల శక్తితో తిరిగి అధికారంలోకి వస్తామన్నారు.