PV NEWS/ నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేయడం కష్టమే…

198

PV NEWS/ NELLORE;-మాయదారి కరోనా అన్ని రంగాలకు ఆర్థికంగా నష్టం కలిగించింది. ముఖ్యంగా హోటళ్లు రెస్టారెంట్ల మూతతో నెల్లూరు నగరంలో కొన్ని వేల మంది నిరుద్యోగులుగా మిగిలారు. యజమానులు నష్టాల బాట పట్టారు. మహా నగరాలకు ధీటుగా నగరంలో ఫుడ్ కోర్టులు , రెస్టారెంట్ల వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. లాక్ డౌన్ తో మూడు నెలలుగా అన్నీ మూతబడ్డాయి. జూన్ 8 నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వటంతో నగర వ్యాప్తంగా హోటళ్లు రెస్టారెంట్లు పునః ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. నగర కమిషనర్ బాపిరెడ్డి హోటళ్ల యజమానులకు ప్రభుత్వ నిబంధనలను తెలియజేశారు. హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఫుడ్ ఇండస్ట్రీ తేరుకో లేని నష్టాల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మనందరి శ్రేయస్సు కోసమే ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో వీటిని పాటించేందుకు పూర్తిస్థాయి చర్యలు చేపడతామన్నారు. సిబ్బంది శానిటైజింగ్ , మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చూస్తామన్నారు. వ్యక్తుల మధ్య దూరం ఉండేలా రెండు కుర్చీలు మాత్రమే వేయాలన్న నిబంధనలను సైతం పాటిస్తామన్నారు. ఇప్పటికే నగరంలో ప్రసిద్ధ హోటల్స్ గా పేరుగాంచిన రెండు హోటల్స్ నష్టాలు భరించలేక మూసివేశారన్నారు.