PV NEWS/ జనసేన నాయకుల రక్తదాన శిబిరం…

73

PV NEWS/ సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని తడలో జనసేన పార్టీ నాయకులు రొసనూరు సోమశేఖర్ ఆధ్వర్యంలో జనసైనికులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో కార్యకర్తలు 100 మంది రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ అజయ్ బాబు జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు. శ్రీపతి రామ్ సూళ్లూరుపేట చిరంజీవి యువత హేమంత్ శర్మ, మాబాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా
అజయ్ బాబు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ పరిస్థితి లో రక్తం కొరతను నివారించేందుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన సోమశేఖర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కొట్టే వేంకటేశ్వర్లు మాట్లాడుతూ సోమశేఖర్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. శేఖర్ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
సోమ శేఖర్ మాట్లాడుతూ సూళ్లూరుపేట జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో రాష్ట్ర లొనే ఆదర్శ వంతంగా కొనసాగుతుందన్నారు. రక్త దానం చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో కృపాకర్ , రాంప్రసాద్, సురేశ్, దీపక్, తేజ తదితరులు పాల్గొన్నారు.