PV NEWS/ వీర మరణం పొందిన జవాన్లకు మౌన దీక్ష తో నివాళులు.. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి

54

PV NEWS/ NELLORE;-ఇటీవల భారత్, చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణ కారణంగా వీర మరణం పొందిన భారత్ జవాన్లకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దేవ కుమార్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ శైలజానాథ్ ఆదేశానుసారం మౌన దీక్ష చేపట్టామన్నారు. జవాన్ల ఆత్మ శాంతి కోసం క్యాండిల్స్ వెలిగించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.