PV NEWS/ కృష్ణపట్నం పోర్టు లో కార్మిక చట్టాలు అమలు చేయాలి… సి ఐ టి యు

27

PV NEWS/ NELLORE;-కరోనా సాకు చూపి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం సిబ్బందిని కార్మికులను బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టులో కార్మిక చట్టాలు అమలు చేయాలని సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని యాజమాన్యానికి పదే పదే విన్నవిస్తున్నప్పటికీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. పోర్టు యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ ఛలో కృష్ణపట్నం పోర్టు ఆందోళన చేపట్టామన్నారు. కార్మికులకు అండగా సిఐటియు నిలుస్తుందని భరోసా ఇచ్చారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు కల్పించుకొని కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మోహన్ రావు, అల్లాడి గోపాల్, అన్నపూర్ణమ్మ,రెహానా బేగం తదితరులు పాల్గొన్నారు.