PV NEWS/ గ్రామీణ యువతకు క్రీడా సామాగ్రిని అందజేసిన MCF ట్రస్ట్ చైర్మన్ మౌనిక రెడ్డి

209

PV NEWS/NELLORE;- పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలి మండలం, వెలికల్లు గ్రామం,మిట్టపాలెం ప్రాంతం, మాతు మదుగు గ్రామీణ యువతకు MCF ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్లు, స్పోర్ట్స్ సామాగ్రిని ట్రస్ట్ చైర్మన్ ఎస్. మౌనికా రెడ్డి అందజేశారు. అనంతరం మౌనిక రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచేందుకు స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. యువత అధిక సమయం క్రీడా మైదానంలో గడిపేందుకు అలవాటు చేసుకోవాలన్నారు. పేదరికం కారణంగా పౌష్టికాహార సమస్యతో యువత చిన్న వయసులోనే ఊబకాయం, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ తో బాధపడుతున్నారన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు తప్పనిసరిగా యువతను క్రీడలలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పేద గ్రామీణ యువత క్రీడల్లో సమర్థవంతగా రాణించగలగిన శక్తి ఉండి, కనీ‌సం క్రీడా సామాగ్రి కొనుక్కునే ఆర్థిక పరిస్థితి లేని వారిని గుర్తించి, వారికి తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు.