PV NEWS/ గర్భిణులకు బాలింతలకు తొమ్మిది రకాల పోషకాహారాన్ని అందజేసిన మౌనిక రెడ్డి

94

PV NEWS/ NELLORE;-రాపూరు మండలం పరిధిలోని మల్లమ్మ గుంట,వెంకటేశ్వర పురం, నవాబ్ పేట – యస్.టి కాలనీల్లో నిరపేద గర్భిణీ స్త్రీలకు ,బాలింతలకు యమ్.సి.ఎప్ అమ్మ కిట్స్ రూపంలో తొమ్మిది రకాల పౌష్టికాహారాన్ని మౌనిక చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మౌనిక రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మౌనిక రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పోషకాహారలోపంతో అధికమవుతున్న మాతృ మరణాల ను నివారించడానికి తమ ట్రస్టు ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గోధుమపిండి, మినప పప్పు, హార్లిక్స్, కందిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, బెల్లం,రాగి పిండి , వేరుశనగ ముద్దలు తదితర పోషకాహార వస్తువులను అందిస్తున్నామన్నారు. అదేవిధంగా శిశువులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ,శిశు మరణాలు సంభవించకుండా ఉండేందుకు ఏడాది వయసు లోపు చిన్నారులు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు గోధుమపిండి, బాదంపప్పు ,హార్లిక్స్, జాన్సన్ బేబీ పౌడర్ ,జాన్సన్ బేబీ ఆయిల్, జాన్సన్ బేబీ ఇయర్ బర్డ్స్, బేబీ టవల్, జాన్సన్ బేబీ పఫ్ బాక్స్, జాన్సన్ బేబీ సోప్ 9 రకాల యమ్.సి.ఎఫ్ అమ్మ బేబీ కిట్లు అందించామన్నారు. వెంకటగిరి పరిసర గ్రామీణ ప్రాంత బీసీ ,ఎస్సీ ఎస్టీ కాలనీ ప్రజలకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.