PV NEWS/ జేబులు నింపే వాళ్ళకేనా! మా నియోజకవర్గానికి ఇవ్వరా? ఇరిగేషన్ అధికారులపై మండిపడ్డ ఆనం

111

PV NEWS/వెంకటగిరి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని జిల్లాస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధి కుంటుపడుతుందని మాజీ మంత్రి వెంకటగిరి శాసన సభ్యులు ఆనం రాం నారాయణ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏం పాపం చేశారని వెంకటగిరి ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తున్నారని ప్రశ్నించారు. వెయ్యి క్యూసెక్కుల నీరు దోపిడీకి గురి అవుతుంటే గుక్కెడు నీటి కోసం వెంకటగిరి రైతాంగం ఎదురుచూస్తుందన్నారు.నియోజకవర్గ ప్రజల కోసం ఏమి అడిగినా నివేదికలుగానే మిగిలి పోతున్నాయని కనీసం వివరణ ఇవ్వడంలో సైతం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి దుర్మార్గాన్ని చూడలేదన్నారు.