PV NEWS/ జనసేన నేతల ఆధ్వర్యంలో సూర్యగ్రహణ ప్రత్యేక పూజలు

42

PV NEWS/GUDURU;-నెల్లూరు జిల్లా గూడూరు లో సూర్యగ్రహణాన్ని పురస్కరించుకుని చిరంజీవి యువత జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఉప పీఠంలో నవగ్రహ నక్షత్ర, రుద్రం అరుణం, ఆదిత్య హృదయం అదేవిధంగా అమ్మవారి నవావరణ యాగం వేద పండితుల సమక్షంలో జరిపించారు. ప్రజల పక్షాన నిలిచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం పొంది ఉన్నత స్థాయికు చేరుకోవాలని ఆకాంక్షించారు. మెగా ఫ్యామిలీ శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విశేషరీతిలో పూర్ణాహుతి హోమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు, తీగల చంద్రశేఖర్, కోటయ్య, విష్ణు, హరి,విజయ్ తదితరులు పాల్గొన్నారు.