PV NEWS/విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

180

PV NEWS/ NELLORE;-రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరోనా లాక్డౌన్ కాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని జిల్లా నాయకులు చేజర్ల సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా జనహిత వాత్సల్య చిన్నారుల వృద్దుల ఆశ్రమంలో ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన యల్. హర్ష, సి.అశోక్, ఎం.ఈష్వర్,ఎ. వెంకటేశ్వర్లు, అంజన్ కుమార్, సి.హెచ్. నిషికా రాజ్ తదితర విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహ నగదు బహుమతులు అందజేశామన్నారు. సూళ్లూరుపేట సబ్ రిజిస్టార్ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ అయ్యప్ప నేని. బాలకృష్ణ రెడ్డి సహకారంతో ప్రతి విద్యార్థికి వెయ్యి రూపాయలు అందజేయడం జరిగిందని అదేవిధంగా Dy DEMO K. ధర్మేంద్ర , మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పుస్తకాలను అందజేశారు. సబ్ ట్రెజరీ అధికారి వి.వి.రమణా రావు పిల్లలకి స్వీట్స్ , మలేరియా విభాగం ఉద్యోగి బి.మాధవ పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో గౌరవరం లక్ష్మీనారాయణ DEMO, జనహిత వాత్సల్య ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరావు, హెడ్మాస్టర్ మథుసుధన్ రెడ్డి ,సబ్ ట్రెజరీ సబ్ రిజిస్ట్రార్ అధికారి బాలకృష్ణ రెడ్డి,K. ధర్మేంద్ర డిప్యూటీ మాస్ మీడియా అధికారి తదితరులు పాల్గొన్నారు.