PV NEWS/ కాపు నేస్తం నమోదు తేదీ గడువు పొడిగించినందుకు ధన్యవాదాలు…. కొణిదెల సుధీర్

63

PV NEWS/ NELLORE;-ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నవశకం లో భాగంగా కాపు నేస్తం పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు 15 వేల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తున్నారని నెల్లూరు జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీ కొణిదెల సుధీర్ తెలిపారు. జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఈ పథకంలో నమోదు చేసుకొని మహిళలకు జూలై 24 వరకు గడువు పొడిగించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వని హామీలను సైతం నెరవేరుస్తున్నారన్నారు. పేద కాపు మహిళలకు ఆర్థిక చేయూత అందించే దిశగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. అర్హులైన కాపు మహిళలందరూ నమోదు చేసుకోవాలని సూచించారు.