PV NEWS/ నారాయణ హాస్పిటల్లో అత్యవసర సేవలు పునఃప్రారంభం…

133

PV NEWS/ NELLORE;- గత కొన్ని నెలలుగా కొవిడ్-19 హాస్పిటల్ గా ఉన్న నారాయణ సోమవారం నుంచి అత్యవసర సేవలను పునః ప్రారంభించనుంది.ఈనెల 4వ తేదీ నుండి ఔట్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించిన చింతా రెడ్డిపాలెం లోని నారాయణ హాస్పిటల్ లో సోమవారం నుంచి అత్యవసర విభాగాల సేవలు ప్రారంభం కానున్నాయి. హాస్పిటల్ ఇంచార్జి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్ హాస్పిటల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. Covid 19 నియమ నిబంధనలను అనుసరించి హాస్పిటల్ కు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు తీసుకురావాలని మాస్కు ధరించాలన్నారు. నిత్యం వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ వైద్య సేవల నిమిత్తం ఫోన్లు చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో వైద్య సేవలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చారన్నారు. ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వార్డులో ధర్మల్ స్క్రీనింగ్ ను ఏర్పాటు చేశామన్నారు. ఇన్ పేషెంట్ వెంట ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందని రోగులను సందర్శించడానికి ఇతరులకు అనుమతులు లేవని ఇందుకు ప్రజలు సహకరించాలన్నారు.