PV NEWS/ ఎమ్మార్పీఎస్ నాయకులు పల్లాల శ్రీనివాసులు వైసీపీలో చేరిక

64

PV NEWS/ NELLORE;-రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో 300 మంది అనుచరులతో ఎమ్.ఆర్.పి.ఎస్. నాయకులు పల్లాల శ్రీనివాసులు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ పార్టీలో నూతనంగా చేరుతున్న ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించి, కుటుంబ సభ్యుడిలా చూసుకుంటానన్నారు. కష్టకాలంలో తనవెంట ఉండి, నడచిన ప్రతి ఒక్కరి ఋణం తీర్చుకుంటానన్నారు. క్షేత్ర స్థాయిలో నాయకులు, కార్యకర్తలు పటిష్టంగానే ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందన్నారు.