PV NEWS/ వాలంటీర్లకు చీరలు పంపిణీ చేసిన వైసిపి నాయకులు కర్తం ప్రతాప్ రెడ్డి

90

PV NEWS/ NELLORE;-రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది అయిన సందర్భాన్ని పురస్కరించుకొని 14 వ డివిజన్ వైసీపీ ఇన్ చార్జ్ ప్రతాపరెడ్డి నిర్వహిస్తున్న సప్త దిన కార్యక్రమాల్లో భాగంగా బాలాజీ నగర్ లోని వికాస్ స్కూల్ లో వాలంటీర్లకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిగా పేద ప్రజల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో లాక్ డౌన్ లో పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.