PV NEWS/ దాడి చేసింది వాళ్లు ;అపనిందలు మాకు.. బయట పెట్టండి వీడియోలు…మంత్రి అనిల్

110

PV NEWS/ NELLORE;-సంఖ్యా బలం ఉందని మండలిలో బిల్లులు అడ్డుకుంటున్నారని టిడిపి నేతలు దాడి చేసి తమపై బురద జల్లుతున్నారని సభలో తీసిన వీడియోలను బయటపెడితే నిజాలు బయటపడతాయని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.బిల్లులు అడ్డుకుని ఉద్యోగులకు జీతాలు ఇవ్వనియకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనిప్రయత్నిస్తున్నారన్నారు.రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక మండలి అడ్డుపెట్టుకుని చౌకబారు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ సభలో వీడియోలు తీస్తుంటే అడ్డుకున్న మంత్రి వెల్లంపల్లిపై దాడి చేశారన్నారు.
చంద్రబాబువి చీకటి రాజకీయాలు, చీకటి ఒప్పందాలేనని ఆరోపించారు.
టి డి పి సంఖ్యా బలం తాత్కాలికమేనని గుర్తు చేశారు. ద్రవ్య వినిమయ బిల్లు అడ్డుకున్న దుర్మార్గపు ప్రతిపక్షంగా చరిత్రలో నిలిచిపోతారన్నారు.
తమపై టిడిపి చేసిన ఆరోపణలను నిరూపించకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.