చైనా నుంచి కరోనాను మించిన వైరస్ ?

264

కరోనా వైరస్ ఎవరికీ లొంగడం లేదు. మానవాళి మొత్తం గజగజ వణుకుతోంది. భూ మండలం మీద ఉన్న మానవ జాతి అంతానికే ఈ మహమ్మారి పుట్టుకువచ్చిందా అన్న అనుమానాలు, సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది దీన్ని బయో వెపన్ అని కూడా డౌట్లు వ్యక్తం చేశారు.

దానికంతటికీ కారణం ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన దేశమైన చైనాలో మొదట వచ్చిన కరోనా వైరస్ ఆ దేశాన్ని పెద్దగా ఏమీ చేయకపోవడం. చైనాలోని వూహాన్ నగరంలో కరోనా కొంత ఇబ్బంది పెట్టింది తప్ప మిగిలిన చోట్ల మాత్రం ఎటువంటి ప్రభావం చూపించలేదు. అదే విధంగా చైనాలో వేలల్లో కరోనా కేసులు ఉన్న వేళ భారత్ లో అసలు కరోనా వూసే లేదు.

కానీ ఈ రోజు భారత్ ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. మరి భారత్ కంటే పెద్ద జనాభా అయిన చైనా ఈ పాటికే మొదటి స్థానంలో ఉండాలిగా అన్నది అందరి సందేహం. చైనాకు కరోనా బయో వెపన్ కాకపోతే కరోనా ఆ దేశాన్ని ఎందుకు చూసీ చూడనట్లుగా వదిలేస్తోంది అన్నది కూడా యావత్తు ప్రపంచానికి కలిగిన అతి పెద్ద అనుమానం. ఇక దీని మీద అమెరికా అసలు ఊరుకోలేదు, కరోనా వైరస్ కాదు అని చైనా వైరస్ అని కూడా డొనాల్డ్ ట్రంప్ ఒకటికి పదిసార్లు అన్నారు కూడా.

ఇదే రకమైన అభిప్రాయంలో చాలా దేశాలు ఉన్నాయి. దాంతో చైనాకు ఎక్కడలేని చెడ్డ పేరు వచ్చింది. ఈ క్రమంలో చైనా నుంచి మరో భయంకరమైన బయో వెపన్ వస్తోందన్న ప్రచారం ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా ఈసారి చాలా పకడ్బంధీగా దీన్ని ప్రయోగిస్తోందని అని కూడా అంటున్నారు. ఈసారి ఈ మరక తనకు అంటకుండా పాకిస్థాన్ నుంచే దీన్ని ప్రయోగించాలని చైనా అనుకుంటోందిట. ఈ మేరకు పాకిస్థాన్ తో చైనాకు ఉన్న స్నేహం కారణంగా ఒప్పందం ఆటోమెటిక్ గా కుదిరిందని ప్రచారం సాగుతోంది. ఆంత్రాక్స్ జాతికి చెందిన వైరస్ నుంచి కొత్తగా బయో వెపన్ తయారు చేస్తున్నారుట.

భయంకరమైన జ్వరం లక్షణాలతో కూడిన ఈ వైరస్ కరోనాను మించేదేనట. ఒక విధంగా ఇది విష జ్వరం అన్న మాట. ఈ వైరస్ కనుక తగిలితే ఏ మందు పనిచేయదు, చాలా తొందరగానే ఆ మనిషి చనిపోతాడుట. హై టెంపరేచర్ తో వచ్చే జ్వరం మనిషిని మొత్తం పిండేస్తుందని అంటున్నారు. దీన్ని చైనా పరిశోధకులే ప్రయోగిస్తున్నారు అంటున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా ఉండేందుకే పాక్ సాయం తీసుకుంటున్నారని వినిపిస్తోంది.

ఈ విష జ్వరం వైరస్ కనుక ప్రపంచం మీద పడితే దాదాపుగా 200 కోట్లకు తగ్గకుండా మానవాళి చనిపోతుందని అంటున్నారు. కరోనాకు కోటి రెట్లు పవర్ ఫుల్ అయిన ఈ వైరస్ ప్రయోగ దశలోనే ఉందని టాక్. అది కనుక బయటకు వస్తే ఆ బయో వెపన్ని ఎదుర్కోలేక మొత్తం ప్రపంచం అతి భారీ మూల్యాన్ని చెల్లించాల్సివస్తుందని అంటున్నారు.