మరికొన్ని చైనా యాప్‌లపై నిషేధం..! అవి ఇవే…

237

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.. ఓవైపు చర్చలు, మరోవైపు టెన్షన్ వాతావరణం ఉంది.. ఇక.. చైనాపై డిజిటల్ ఉద్యమానికి తెరలేపిన భారత్… ఏకంగా ఆ దేశానికి చెందిన 59 సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధం విధించింది.. ఇక, మరికొన్ని మొబైల్ యాప్‌లను బ్యాన్ చేయడానికి సిద్ధమవుతోంది కేంద్ర ఐటీ శాఖ.. ముఖ్యంగా చైనాతో సంబంధమున్న మొబైల్ అప్లికేషన్లపై గురిపెట్టినట్టుగా తెలుస్తోంది.. ఇందులో హలా లైట్‌, షేరిట్ లైట్‌, బిగో లైట్, వీఎఫ్‌వై లైట్ వంటి యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ నుంచి తొలగించేందుకు సిద్ధమవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. భారత్ బాటలోనే మరికొన్ని రాష్ట్రాలకు కూడా.. చైనా యాప్స్ ముఖ్యంగా.. టిక్‌టాక్‌పై బ్యాన్ విధించే ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే.