కోవిడ్ సేవలందించే వారి పట్ల బాధ్యతగా వ్యవహరించండి… మంత్రి అనిల్

80

PV NEWS/ NELLORE;-కోవిడ్ సేవలందించే వైద్యశాఖ సిబ్బంది, పోలీసుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని వారిని భయభ్రాంతులకు గురి చేయవద్దని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాను కోరారు. కరోనా నిర్ధారణ సంచార వాహనాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారు ప్రోత్సాహాన్ని కోరుకుంటారని అందుకు భిన్నంగా కొందరు దుష్ప్రచారాల తో నిరుత్సాహ పరచడం సరికాదన్నారు. నిత్యం అధికార పార్టీ పై బురదజల్లడమే టిడిపి పనిగా పెట్టుకుందని, తీరు మార్చుకోవాలన్నారు. అత్యధిక సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచార వాహనాలను ఏర్పాటు చేశారన్నారు. బాధితులకు వసతి, అందించే ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించామన్నారు. కరోనా వైరస్ సోకిన జర్నలిస్టులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని తమ కార్యాలయ సిబ్బందికి సైతం వ్యాధి సోకిందన్నారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి బారి నుండి బయట పడేందుకు అవకాశం ఉందన్నారు.