PV NEWS/ దోపిడీ చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి…. ఏబీవీపీ

153

PV NEWS/ NELLORE;-కరోనా కష్టకాలంలోనూ ఆన్ లైన్ క్లాస్ ల పేరుతో ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని, విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. నగరంలోని కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే ఫీజులను నియంత్రిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలన్నారు.