నూతన కలెక్టర్ చక్రధర బాబు ను సన్మానించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

79

PV NEWS/ NELLORE;- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నూతనంగా ఏర్పడిన జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు చొప్పా. రవీంద్ర బాబుతో కలసి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కె వి ఎన్ చక్రధర్ బాబును సన్మానించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ను అదేవిధంగా జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జున రావు ను కలిసి నూతన కార్యవర్గాన్ని పరిచయం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ల సాధనలో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ ఏనుగు రమణారెడ్డి జిల్లా సెక్రెటరీ వై. మల్లికార్జున, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ చేజర్ల సుధాకర్ రావు, ఉపాధ్యక్షులు ఈ. విల్సన్, యస్. చక్రవర్తి, డి. సుబ్బారాయుడు , సిటీ అధ్యక్షుడు పులి సతీష్ , ఆర్గనైజింగ్ సెక్రటరీ మునియ్య, జిల్లా జాయింట్ సెక్రెటరీ బాల సుబ్రహ్మణ్యం , కె.వి శ్రీకాంత్ రావు. జిల్లా నాయకులు సూర్య ప్రకాశం, ప్రసాద్ గౌస్ బాషా, కె.వి .ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.