PV NEWS/ ఎస్ సి,ఎస్ టి ఉద్యోగులను వేధిస్తున్న వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి… స్వర్ణ వెంకయ్య

85

PV NEWS/ NELLORE;-నెల్లూరు జిల్లా కోట గ్రామంలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకులం లో పనిచేస్తున్న ఎస్టి ఎస్సి ఉద్యోగులను కులం పేరుతో దూషిస్తూ వేధింపులకు గురి చేస్తున్న మూడవ జోన్ ఏ బి సి డబ్ల్యూ ఓ కే శ్రీనివాసులు, పాఠశాల ప్రిన్సిపాల్ పాండురంగారావు, పాఠశాల కాంట్రాక్ట్ పి ఈ టి విష్ణువర్ధన్ లపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణ వెంకయ్య డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ బీసీ గురుకులంలో విధులు నిర్వహిస్తున్న 16 మంది ఉద్యోగులను బెదిరిస్తున్నారని వారు చెప్పిన పనులు చేయకపోతే మెమోలు ఇవ్వటం జాబ్ చార్ట్ కు వ్యతిరేకంగా పనులు అప్పగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఉద్యోగులను వేధిస్తున్న వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు వెంకయ్య, ప్రధాన కార్యదర్శి గంధం రమేష్, బాల సుధాకర్, తురక గోపీనాథ్, గురుకుల టీచింగ్ నాన్-టీచింగ్ పాల్గొన్నారు.