సిపిఎస్ ఉద్యోగుల పై పెట్టిన కేసులు ఎత్తి వేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.. ఏపీ సిపిఎస్ ఎంప్లాయిస్ యూనియన్

194

PV NEWS/ NELLORE;-గత ప్రభుత్వంలో సిపిఎస్ ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఏపీ సిపిఎస్ ఈఏ నెల్లూరు జిల్లా శాఖ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ, ధనరాజ్,ఆర్. రామ్ కిషోర్ లు మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న ఏకైక డిమాండ్ తో ఏపీ సిపిఎస్ ఈ ఏ ఉద్యోగులు 2019 జనవరి 31వ తేదీన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. సిపిఎస్ ఉద్యమకారులపై గత ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పి మనోవేదనకు గురి చేసిందన్నారు. కేసులను ఉపసంహరించుకోవాలని అనేక మార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే సిపియస్ ఉద్యోగుల పై పెట్టిన కేసును రద్దు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు క్యాబినెట్ సమావేశంలో సిపియస్ ఉద్యోగుల పై పెట్టిన కేసులను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారన్నారు. రాష్ట్రంలోని రెండు లక్షల మంది సిపియస్ ఉద్యోగులు ఉపాధ్యాయుల పక్షాన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సిపియస్ ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన జిల్లా మంత్రి(ఇరిగేషన్ శాఖ ) డాక్టర్ పోలుబోయిన. అనిల్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.