PV NEWS/ కూరగాయల మార్కెట్లను పరిశీలించిన నగర కమిషనర్ టి.బాపిరెడ్డి

100

PV NEWS/NELLORE;-కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లను నగర కమిషనర్ బాపిరెడ్డి, ఆర్ డి ఓ, నగర డి.ఎస్.పి, ఇతర విభాగాల అధికారులతో కలసి పరిశీలించారు. Covid 19 మార్గదర్శకాలను అనుసరించి వినియోగదారుల మధ్య భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు వహిస్తున్నామని కమిషనర్ తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ నగర్ ఎస్వీజిస్ కళాశాల ప్రాంగణం, నవాబు పేట వ్యవసాయ మార్కెట్టు తదితర ప్రాంతాల్లో పర్యటించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వినియోగదారులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రక్షణ శాఖ పర్యవేక్షణలో ప్రతీ వినియోగదారుడు భౌతిక దూరం పాటిస్తూ క్యూ పద్ధతిలో కొనుగోలు చేయాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి ఆస్కారం లేకుండా అన్ని మార్కెట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.