చిల్డ్రన్స్ పార్క్ స్కేటింగ్ రింక్ పునఃనిర్మాణ పనుల పరిశీలన

136

PV NEWS/ NELLORE;-రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చొరవతో నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ లో వేగంగా జరుగుతున్న స్కేటింగ్ రింక్ పునఃనిర్మాణ పనులను స్కేటింగ్ అసోసియేషన్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భముగా నాయకులు రింకుకు సంబంధించిన పలు అంశాలపై హెల్త్ వర్క్స్ విభాగం డిప్యూటీ ఇంజనీరు సుధారాణి, కాంట్రాక్టర్ దుర్గా ప్రసాద్, పార్క్ వర్క్స్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునతో చర్చించారు. పనులను నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, శాస్త్రీయంగా త్వరతగతిన ముగించాలని కోరారు. ప్రభుత్వ మార్గానిర్దేశాల ప్రకారం శిక్షణా తరగతులను నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రములో సంఘము ఉపాధ్యక్షులు మలిరెడ్డి శ్రీనివాసులు, వ్యవస్థాపకులు నిమ్మల వీర వెంకటేశ్వర్లు, కార్యదర్శి గుర్రం ఈశ్వర్, సభ్యులు ఆవుల మల్లికార్జున, కందుకూరు రమేష్, కోచ్ లు పాల్గొన్నారు.