PV NEWS/ రైతు భరోసా కేంద్రాలను సందర్శించిన ఎంఎల్ ఎ కాకాణి

45

PV NEWS/NELLORE;-రైతు భరోసా కేంద్రం ద్వారా అవసరమైన ద్వారా విత్తనాలు ఎరువుల అందిస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా వైసిపి అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం మండలం, ఇస్క పాళెం రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఇస్కపాళెం గ్రామంలో కిడ్నీ వ్యాధి సమస్యలు, పక్షవాతం తదితర వ్యాధులతో బాధపడుతున్న వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు రైతుభరోసా నగదును అందిస్తామన్నారు.గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారన్నారు.సర్వేపల్లి రిజర్వాయర్ కు సంబంధించి ₹11.35 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించామన్నారు.సర్వేపల్లి రిజర్వాయర్, కనుపూరు కాలువలకు 30 కోట్లతో నీరు అందజేయడానికి నిధులు మంజూరు చేయించామన్నారు.సుదీర్ఘకాలంగా కిడ్నీ వ్యాధులు, పక్షవాతం తదితర వ్యాధులతో బాధపడుతున్న వారికి ₹5000/-ల పెన్షన్, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు ₹10,000/-ల పెన్షన్ నెల నెల అందజేస్తున్నామన్నారు. నూతన పింఛన్లు మంజూరు చేస్తూ, వ్యాధులతో బాధపడుతున్న వారికి జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారన్నారు.అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నామన్నారు.