సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన 16 వ డివిజన్ ఇంచార్జి వేనాటి శ్రీకాంత్ రెడ్డి

104

PV NEWS/ NELLORE;-ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆనారోగ్యానికి చికిత్స చేయించుకోలేని స్థితిలో ఉన్న మోపూరు రమేష్ కు 16 వ డివిజన్ వైసీపీ ఇన్ చార్జ్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత మొత్తాన్ని బాధితునికి అందజేశామన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గతం కంటే మిన్నగా ఆరోగ్య శ్రీ సేవలను మరింత మెరుగు పరచారని తెలిపారు. ఆరోగ్యశ్రీ వర్తించనివారి చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుందన్నారు.