PV NEWS/ సిఐ తీరుపై ఫిర్యాదు చేసిన కానిస్టేబుల్

387

PV NEWS/ NELLORE;-నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారావు తనను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడని రాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గంగాధర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బైక్ సీజ్ కేసు విషయంగా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో సిఐ కి కానిస్టేబుల్ కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాను కానిస్టేబుల్ నని చెబుతున్నప్పటికీ దుర్భాషలాడి చేయి చేసుకున్నారని పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఆందోళన చేసిన కానిస్టేబుల్. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో పోలీసు సంఘ నాయకులు ఇద్దరిమధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు.