PV NEWS/ దేశాభివృద్ధి కోసం ప్రధాని.. రాష్ట్ర వినాశనం కోసం ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు-కేతంరెడ్డి

76

PV NEWS/ NELLORE;-కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి పథకాలను ప్రవేశపెడుతూ ఉంటే విద్యుత్, మద్యం, నిత్యావసర సరుకుల ధరలను పెంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దోచుకున్నారని జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. జనసేన సిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జన్ ధన్ యోజన బ్యాంక్ ఖాతాలున్న వారికి 500 రూపాయలు నగదు సహాయం అందించి ప్రధాని ఆదుకున్నారని తెలిపారు. దేశంలోని 9 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష నగదు సాయం చేసి ప్రోత్సహించారన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం కరోనా మరణాల సంఖ్య, శాతం తక్కువగా ఉండడానికి కారణం ప్రధాని తీసుకున్న చర్యలే కారణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు కష్టపడి సంపాదిస్తున్న ధనాన్ని నవరత్నాల పేరుతో పంపిణీ కోసం అనైతిక విధానాలలో దోపిడీ చేస్తున్నారన్నారు. లాక్ డౌన్ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించిన సాయం కేవలం 1000 రూపాయలు మాత్రమే అని తెలిపారు