జల్సాలకు అలవాటు పడిన దొంగలు అరెస్ట్… పది మోటార్ సైకిళ్ళు స్వాధీనం

101

PV NEWS/ NELLORE;- మోటార్ సైకిళ్ళు, బీచ్ వద్ద పర్యాటకుల బంగారు చైన్ లను, సెల్ ఫోన్ లను దొంగతనం చేసే ఇందుకూరుపేట మండలానికి చెందిన ముసల సందీప్, కొడవలూరు మండలానికి చెందిన కరివేటి శ్రీ కుమార్ లను ఎస్ ఐ లు జిలాని, సురేష్ ఆధ్వర్యంలో అరెస్టు చేయడం జరిగిందని క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ బాజీ జాన్ తెలిపారు. వ్యసనాలకు విలాసాలకు బానిసలై దొంగతనాలు చేస్తున్నారని గతంలోనూ పలుమార్లు దొంగతనం చేస్తూ పట్టుబడ్డారన్నారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ భాస్కర్ భూషణ్, డిఎస్పి శ్రీనివాసుల రెడ్డి అభినందించారు