గుడ్ న్యూస్.. 30 సెకెండ్లలో కరోనా టెస్ట్.. గొంతు ఆధారంగా..?

164

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమై పోతున్నాయి. జనజీవనం మొత్తం తలకిందులు అయిపోతుంది. ఏం చేయాలన్న ప్రస్తుతం జనాలు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో కొన్ని దేశాల్లో అయితే పరిస్థితి రోజు రోజుకు చేయి దాటిపోతుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కరోనా వైరస్ మాత్రం కట్టడి చేయలేక పోతున్నారు. రోజురోజుకు ఈ వైరస్ భారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది.

ఈ వైరస్ కి ప్రస్తుతం ఎలాంటి వాక్సిన్ అందుబాటులోకి రాకపోవడం కూడా ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది.. మహమ్మారి కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో.. రోగులను సత్వరంగా గుర్తించడమే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న లక్ష్యం అనే విషయం తెలిసిందే. అత్యంత వేగంగా కరోనా వైరస్ బాధితులకు పరీక్షలు నిర్వహించి… రోగులను సత్వరంగా గుర్తించే విధంగా ప్రస్తుతం అన్ని దేశాలు ఎంతగానో చర్యలు చేపడుతున్నాయి. అయితే బాధితులను అత్యంత వేగంగా గుర్తించగల సరికొత్త టెక్నాలజీ అభివృద్ధి దిశగా భారత్ ఇజ్రాయిల్ సంయుక్తంగా కృషి చేస్తున్నాయట .

ప్రస్తుతం లాలా జలం ద్వారా ఈ కరోనా రోగులను గుర్తిస్తుండగా.. ఈ సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే కేవలం వ్యక్తుల స్వరం శ్వాస వంటి పరీక్షల ఆధారంగానే కరోనా రోగులను గుర్తించేందుకు ప్రస్తుతం పరిశోధన జరుగుతున్నట్లు సమాచారం. దీనికోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ, శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధక మండలి, భారత ప్రధాన శాస్త్రీయ సలహాదారు, ఇజ్రాయిల్ కు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి డైరెక్టరేట్ సంయుక్తంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయట. ఇందులో ఒకటి స్వర్గంలోని తేడాలను ఆధారంగా చేసుకుని కరోనా బాధితులను గుర్తిస్తే.. మరో పద్ధతిలో ఒక ట్యూబ్లోకి గాలిని ఊదించటం ద్వారా కరోనా ను గుర్తించేందుకు అవకాశం ఉంటుందట, ఈ నూతన టెక్నాలజీని అందుబాటులోకి వస్తే కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు అని చెబుతున్నారు పరిశోధకులు,