నడిరోడ్డుపై కరోనా పేషెంట్.. ఇది ఏపీలో 108 సిబ్బంది నిర్వాకం

241

అనంతపురం: కరోనా పేషెంట్‌ను నడిరోడ్డుపై వదిలివెళ్లిన ఘటన అనంతపురం జిల్లా పెనుగొండలో కలకలం రేపింది. మడకశిర నియోజకవర్గం గుండమల పంచాయతీ పీఎస్ తండాకు చెందిన గోపీ నాయక్ అనే వృద్ధుడికి 16 రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో అనంతపురంలో కరోనా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు. చికిత్స పొందుతున్నాడకున్న వ్యక్తికి పెనుగొండ మడకశిర వెళ్లే రహదారిలో వదిలేశారు 108 సిబ్బంది. స్థానికులు ఆరా తీసి సమాచారం అందించడంతో అతని కొడుకు తిమ్మానాయక్ తండ్రిని సొంత గ్రామానికి తీసుకెళ్లారు. కరోనా బాధితుడిని 108 ఇలా బాధితుడిని నడిరోడ్డుపై వదిలివేయడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.