పబ్జి ఫుడ్ కోర్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

33

PV NEWS/ NELLORE;- ఇస్కాన్ సిటీ, కావేరి ఎవెన్యూ ప్రాంతంలో ఉన్న పబ్జి ఫుడ్ కోర్ట్ నిర్వాహకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రూరల్ కార్యాలయ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ రక్త నిల్వల కొరత అధికంగా ఉంన్న ఈ సమయంలో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న సమయంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా రూరల్ నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉంటామన్నారు. ఈ శిబిరంలో సుమారు 50 మంది యువత రక్తదానం చేశారు. కార్యక్రమంలో పబ్జి నిర్వాహకులు రమణ, మిస్టర్ స్మూథీస్ నిర్వాహకులు చైతన్య, ఐదవ నగర ఎస్ ఐ పుల్లారెడ్డి, నోవా బ్లడ్ బ్యాంకు ప్రతినిధి మోపూరు భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.