అధికార పార్టీ నాయకుల దోపిడీకి బలి అవుతున్న దళితులు….

63

PV NEWS/NELLORE;- ఒక్క అవకాశమంటూ దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా మిగిలిపోయారని నెల్లూరు టిడిపి నగర ఇన్చార్జి మాజీ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. నగరంలో టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ దళితులపై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దళిత శంఖారావం పూరించాలని తమ మద్దతు పూర్తిగా ఉంటుందని తెలిపారు.మనుబోలు మండలం చెర్లోపల్లి, వెంకన్నపాళెం, వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెం, తోటపల్లిగూడూరు మండలం క్రిష్ణారెడ్డిపాళెం తదితర గ్రామాల్లో దళితులు దశాబ్దాలుగా అనుభవించుకుంటున్న భూములను లాక్కునేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. వెంకన్నపాళెంలో దళితులను కేసుల పేరుతో వేధిస్తున్నారన్నారు.