బారా షహీద్ దర్గా గంధమహోత్సవానకి 20 మందికి మాత్రమే అనుమతి…

114

PV NEWS NELLORE;- ప్రసిద్ధ బారా షహీద్ దర్గా స్వర్ణాల చెరువు రొట్టెల పండుగ మహోత్సవంలో పాల్గొనేందుకు 20 మందికి మాత్రమే అనుమతిని ఇస్తున్నట్లు ఆర్డివో హుస్సేన్ తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ రూరల్, అర్బన్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి, వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ తదితర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు జరిగే రొట్టెల పండుగ వేడుకకు 20 మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. పాల్గొనే 20 మంది కోవిడ్ నెగటివ్ నిర్ధారణ పత్రాలతో హాజరు కావాలన్నారు. హాజరయ్యే వారి పేర్లు, ఆధార్ కార్డులు, కోవిడ్ నెగెటివ్ ధ్రువపత్రాలను ఈనెల 29వ తేదీ లోపు నమోదు చేసుకోవాలన్నారు.