కోవిడ్ ఆసుపత్రులకు సంబంధించిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి… అప్లై చేసుకోండి…

269

PV NEWS/ NELLORE;-నెల్లూరు జిల్లాలో కోవిడ్ ఆసుపత్రులకు సంబంధించి ఖాళీగా ఉన్న 1800 పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభమైందని జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. స్పెషలిస్టులు, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఎఫ్ ఎన్ఒ, ఎం ఎన్ ఒ, సానిటరీ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ ల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశామని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశామన్నారు. ఈ విభాగాలకు సంబంధించి ఇంకా పోస్టులు ఖాళీగా ఉన్నాయని అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావలసిందిగా సూచించారు.