సెప్టెంబరు 1న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన…ఏపిజిఇఏ

158

PV NEWS/ NELLORE;- సెప్టెంబర్ ఒకటో తేదీన భోజన విరామ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సి పి ఎస్ రద్దు కోరుతూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేయాలని ఏపీ జిఇ ఏ జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్, జిల్లా సెక్రెటరీ మల్లికార్జునర పిలుపునిచ్చారు. అపోలో హాస్పిటల్ సమీపంలో ఉన్న కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు హక్కుగా సంక్రమిస్తూ వస్తున్న పెన్షన్ రద్దు చేయబడి, 2004 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో చేరిన ఉద్యోగులకు, వారి ఉద్యోగ విరమణ అనంతరం వచ్చే పెన్షన్ లేకుండా చట్టం చేయబడిందన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు ఒకటవ తేదీని ఉద్యోగ విద్రోహదినంగా జరుపుకుంటున్నామన్నారు. అప్పటినుంచి CPS విధానాన్ని రద్దు చేసి OPS విధానాన్ని పునరుద్ధరించాలని నిరసనలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది covid-19 పరిస్థితులు ఉన్నప్పటికీ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించాలని రాష్ట్ర సంఘం నిర్ణయించిందన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన జిల్లాలోని అన్ని కార్యాలయాల వద్ద APGEA సభ్యులు, CPS ఉద్యోగుల సంఘం సభ్యులు భోజన విరామ సమయంలో covid-19 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP), covid-19 ప్రోటోకాల్ అనుసరించి, మాస్కులు ధరించి 2 మీటర్ల సామాజిక దూరాన్ని పాటిస్తూ, ప్లకార్డులతో నిరసనలు, నినాదాలతో CPS విధానాన్ని రద్దు చేయాలని, OPS విధానాన్ని పునరుద్ధరించాలని నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఉదయం నుంచి నల్ల బాడ్జీలు ధరించి కార్యక్రమాలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎపిజిఈఎ నాయకులు డాక్టర్ మానమాల. సులక్షణ, ఇరిగేషన్ నాయకులు మల్లికార్జున, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.