వందల ఏళ్ళ చరిత్రలో మునుపెన్నడూ ఈ విధంగా జరగలేదు….

299

PV NEWS/ NELLORE;- 400 ఏళ్ల చరిత్ర కలిగిన బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఇంత నిరాడంబరంగా జరిగిన దాఖలాలు లేవు. ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూలల నుంచి తమ మొక్కులు తీర్చుకునేందుకు దర్గా కు వచ్చే వాళ్ళు. స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకునేందుకు పోటీలు పడేవారు. అన్ని రాష్ట్రాల నుంచి వందలాది చిరు వ్యాపారులు ఉపాధి పొందేవారు. కరోన కారణంగా ఈ ఏడాది మొహరం గంధమహోత్సవంలో పాల్గొనేందుకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. తమ సుదీర్ఘ అనుభవం లో ఇంత నిరాడంబరంగా గంధమహోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగలేదని మతగురువులు తెలిపారు.