నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులుగా అబ్దుల్ అజీజ్….

115

PV NEWS/ NELLORE;-కార్పొరేటర్ స్థాయి నుంచి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు గా ఎదిగిన అబ్దుల్ అజీజ్. ఆశించిన సిటీ ఎమ్మెల్యే టికెట్ నిరాశపరిచిన వెనుకడుగు వేయక పార్టీకి అండగా నిలిచారు. రూరల్లో పట్టు లేకపోయినప్పటికీ ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను దుయ్య బడుతూ దూసుకుపోతున్న మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ కు పార్టీ అధిష్టానం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. ఈ ప్రకటనతో టిడిపి కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.