ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం… గణేశం వెంకటేశ్వర్లు

91

PV NEWS/ NELLORE;- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైయస్సార్ ఆసరా వారోత్సవాల సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూచనలతో 15 డివిజన్ ఇంచార్జ్ గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. డివిజన్లోని పొదుపు సంఘాల మహిళలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. పొదుపు సంఘాలకు తొలి విడతగా చెక్కు రూపంలో 1, 59, 51, 455 రూ అందజేశారు. అనంతరం 15 డివిజన్ ఇంచార్జ్ గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మూలపేట శివాలయం చైర్మన్ లోకి రెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి 10, 11, డివిజన్ల ఇంచార్జులు, మెప్మా సిబ్బంది, ఆర్ పి లు, పొదుపు సంఘాలు, వైయస్సార్ సిపి నాయకులు శరత్ రెడ్డి, శివ ప్రసాద్ రెడ్డి, షమీం, జాన్, దిలీప్ రెడ్డి శేషు, కిషోర్ మరియు సచివాలయం అడ్మిన్ లు వాలంటీర్లు పాల్గొన్నారు.