చీదెళ్ళ కిషన్ ఆధ్వర్యంలో ప్లాస్మా దానంపై అవగాహన

110

Peoples Voice/NELLORE;-44వ డివిజన్ వైఎస్ఆర్సిపి నాయకులు చీదెళ్ళ కిషన్ ఆధ్వర్యంలో ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ నిత్యం వందల సంఖ్యలో నమోదవుతున్న covid-19 కేసుల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కు విజయవంతంగా చికిత్స అందించడంలో ప్లాస్మా థెరపీ ప్రముఖ పాత్ర వహిస్తుందన్నారు. కరోనాను జయించిన వారు చేసిన ప్లాస్మా దానం తో ఇద్దరు కరోన బాధితులకు చికిత్సను అందించవచ్చన్నారు. ప్లాస్మా దానంపై అవగాహన కలిగించేందుకు 44వ డివిజన్ లోని కరోనాను జయించిన వారి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం నాయకులు హరీష్, మనోహర్, రవి, బాజీ, వీరేష్, సాదిక్, స్థానికులు మణి, బాలు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.