ఏడాదికల్లా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి…. మంత్రి అనిల్

93

Peoples Voice/NELLORE; – నెల్లూరు నగరంలోని హరనాథపురం సెంటర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇతర అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు 50 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ ను ఏడాదిలోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మరో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. కరోనా నియంత్రణకు చిత్తశుద్ధితో పని చేస్తుంటే భయంతో ఇంట్లోంచి బయటికి రాని వాళ్ళు విమర్శించడం సరికాదన్నారు.