Covid 19 మృత దేహాల తరలింపుకు అంబులెన్స్ అందజేసిన రెడ్ క్రాస్

176

PV NEWS/ NELLORE;- Covid 19 కారణంగా మృతి చెందినవారి దేహాలను స్మశాన వాటిక కు తరలించేందుకు ప్రభుత్వ వైద్యశాలకు రెడ్ క్రాస్ తరఫున అంబులెన్స్ ను అందజేస్తున్నామని రెడ్ క్రాస్ చైర్మన్, శ్రీ కృష్ణ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో గత కొన్ని నెలలుగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రోగులకు పండ్లు, వాటర్ బాటిళ్లను అందజేశామన్నారు. మృతదేహాల తరలింపుకు ఆంబులెన్స్ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని అందజేశామన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్ అవసరాన్ని గుర్తించి అంద చేసినందుకు చంద్రశేఖర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.