10 టన్నుల రవాణాకు ఐదు వేల రూపాయలు… ఏపీఎస్ఆర్టీసీ కార్గో

138

PV NEWS/ NELLORE;- కార్గో ద్వారా రాష్ట్రంలో ఎక్కడ నుంచి అయినా కేవలం 5 వేల రూపాయలకు10 టన్నుల రవాణా కు ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టిందని ఏటీఎం అధికారి అనిల్ కుమార్ తెలిపారు. కార్గో ద్వారా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుకు రవాణ కోసం చర్యలు చేపడుతున్నామన్నారు.
నెల్లూరు జిల్లా గూడూరు డిపోలలో కార్గో పాయింట్ లను సందర్శించి డిపో మేనేజర్ లకు సూచనలు సలహాలు అందజేశారు. వినియోగదారుల నుంచి ఎటువంటి ఫిర్యాదుల కు అవకాశం లేకుండా పని చేయాల్సిందిగా సూచించారు. అనంతరం అనిల్ కుమార్ మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ నూతనంగా ప్రవేశపెట్టిన కార్గో సదుపాయాల గురించి వ్యాపారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు సామాన్య వినియోగదారులకు ఉపయోగపడే విధంగా బల్క్ ట్రాన్స్ పోర్ట్ పై అతి తక్కువ రేట్లకే కార్గో లోజిస్టిక్ సర్వీస్ ను ప్రారంభించినట్టు తెలిపారు.50 కిలోమీటర్లు దాటితే కనీస ధర ఐదు వేల రూపాయలకు 10 టన్నులు ఒకేసారి కార్గో డిజిటి ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సమీప రాష్ట్రాలలోని హైదరాబాద్, చెన్నై ,బెంగళూరులకు సైతం లగేజీ రవాణా చేయగలమని తెలిపారు.ఇతర కార్గో ట్రాన్స్పోర్ట్ ల కన్నా తక్కువ రేట్లకే ట్రాన్స్పోర్ట్ చేయగలమన్నారు.